Wednesday, February 16, 2011

Pithapuram







పాదగయ  (Shiva Temple):
భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠములలో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం ఈ కుక్కుటేశ్వరుడి దేవళంలో ఉండేది. పుస్తకాలలో, పురాణాలలో కల ఈ పీఠం కాని, ఆ శక్తి విగ్రహం కాని ప్రస్తుతం కానరావు. ఈ పీఠం మూలంగానే పిఠాపురానికి పీఠికాపురం అనే పేరు వచ్చిందని అంటారు. ఈ హుంకారిణీ శక్తి విగ్రహం రైలు స్టేషన్ కి ఎదురుగా ఉన్న మట్టి దిబ్బలో భూస్తాపితమై ఉన్నదని లోక ఐతిహ్యం ఉంది. పురావస్తు పరిశోధక శాఖ వారు తవ్వకాలు జరిపించి చూస్తే కనిపించవచ్చని ప్రజలు అనుకొంటారు. ఈ కుక్కుటేశ్వరుడి ఆలయ ప్రాంగణం లోనే కాలభైరవుడి విగ్రహం "వ్రీడావిహీనజఘనమై" చూసేవారికి సిగ్గును కలిగించేదిగా ఉంది. కుక్కుటేశ్వరుడి గుడికి ఎదురుగా ఒక తటాకం ఉంది. దానిని "పాదగయ" అంటారు. ఈ పాదగయకి ఆ పేరు ఎలా వచ్చిందో వివరిస్తూ రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. గంగా తీరమున ఉన్న గయ "గయా శీర్షం" అనీ, పిఠాపురంలో ఉన్నది "పాదగయ" అనీ ఒక సిద్ధాంతం. అందుకనే పాదగయలో స్నానం చేస్తే గంగలో చేసినంత ఫలితం అని ఒక నమ్మకం ఉంది. గయుడు అనే రాక్షసుడి పాదాలు అక్కడ ఉన్నాయి కనుక ఇది పాదగయ అయిందని మరొక వదంతి. గయునికి సంభందించిన ఒక కధనం ప్రకారం గయుని చావు తరువాత చచ్చిన శవం యొక్క బుర్ర సింహాచలం దగ్గర, పాదాలు పిఠాపురం దగ్గర పడ్డాయిట. అందుకని సింహాచలం నుండి పిఠాపురం వరకు ఉన్న ప్రదేశం పాపభూమి అనేవారు. పాపభూమి కాబట్టే ఈ మధ్య ప్రదేశంలో పుణ్య క్షేత్రాలు లేవుట. అన్నవరం తదనంతర కాలంలో ప్రశస్తి చెందినది. అందువలననే శ్రీనాధుని రచనలలో ఎక్కడా అన్నవరం చరిత్ర కనబడదు. 

కుక్కుటేశ్వరస్వామి మందిరంలోని రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం ఆవరణలో పురుహూతికా దేవి ఆలయం ఉంది. ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి.
పిఠాపురంలో ఇతర ఆలయాలు: వేణు గోపాలస్వామి ఆలయం, కుంతి మాధవస్వామి ఆలయం (పంచ మాధవ క్షేత్రాలలో ఒకటి), శ్రీపాద వల్లభ అనఘ దత్తక్షేత్రం, దత్తాత్రేయ మందిరం, నూకాలమ్మ గుడి (గ్రామదేవత), కుక్కపాముగుడి (సీతయ్యగారి తోట), రాముని కోవెల (మంగాయమ్మరావు పేట), వెంకటేశ్వరస్వామి గుడి (కుక్కుటేశ్వరస్వామి ఆలయం వద్ద), కోతి గుడి (మార్కెట్ వద్ద), సాయిబాబా గుడి (చిన్న పోస్టాఫీస్ వద్ద), పురుహూతికా అమ్మవాఱు (పాత బస్ స్టాండ్ వద్ద), కోట సత్తెమ్మ తల్లి గుడి (సీతయ్యగారి తోట), శ్రీ విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం (పాత బస్టాండ్ వద్ద)

















1 comment:

  1. దత్తాత్రేయస్వామి గుడి చాలా బాగుంది అండీ..
    ధ్యాంక్యూ...

    ReplyDelete